Saturday, February 13, 2021

alfa edison

 

February 14, 2020 
Shared with Public
Public
May be an image of 1 person
"ప్రపంచాన్ని చీకట్ల నుండి కాపాడిన ఒక యోధుని కథ---------------------------------------------
1855 మిషికాన్ లోని పోర్టుహ్యూరాన్ ప్రాంతం,
8 యేండ్ల పిల్లవాడి చేయిపట్టుకొని పాఠశాల నుండి ఆ పిల్లాడి అమ్మ దగ్గరకు రుసరుసలాడుతూ వచ్చింది ఒక లేడీటీచర్.... వస్తూనే ఆ అబ్బాయి తల్లిని చూస్తూ..ఏమ్మా..ఎన్నిసార్లు లెటర్స్ రాయాలి?? మీ అబ్బాయి ఒక మంద బుద్ది గలవాడు.. వాడికి చదువు చెప్పడం మావల్ల కాదని. ఇంక బడికి పంపకండి... ఇంట్లోనే వుంచుకొని ఏమైనా పనులు నేర్పించుకోండి. మళ్ళీ బడికి పంపవద్దు అని చెప్పి, అక్కడ నుండి వెళ్ళి పోయింది.. ఆమె వెళ్ళిన పదినిమిషాలకు తేరుకుంది ఆ తల్లి.. కళ్ళ నిండా నీరు కమ్ముతుండగా.. అమాయకంగా తన వంక చూస్తున్న తన కొడుకు కళ్ళలోనికి చూసింది. ఏమనుకుందో ఏమో? వాడిని గట్టిగా కౌగిలించుకుంది. నిజమే ఆ అబ్బాయికి ADHD అనే మానసికవ్యాధివుంది. అందరి పిల్లలలా ఆ అబ్బాయి తొందరగా నేర్చుకోలేడు, అర్థం చేసుకోలేడు. అదీగాక ఏడవ సంతానంలో చివరివాడతడు. తండ్రి త్రాగుడికి అలవాటై ఎటో వెళ్ళిపోయాడు. ఆ ఆలోచనల నుండి తేరుకొన్న వాళ్ళ అమ్మ వాడిని ఇంట్లోకి తీసుకెళ్ళింది.
ఆ రాత్రంతా వాడి గురించి ఆలోచించింది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ ఇంటినే ఒక పాఠశాలగా మార్చేసింది. తనే టీచర్ అయింది. ఆ పిల్లాడికి ఇల్లే ఒక ప్రయోగశాల అయింది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ప్రపంచ చీకట్లను ప్రారద్రోలే ఒక మహా వెలుగవుతుందని బహుశా ఆమె ఊహించి వుండదు.
ఆ పిల్లాడు ప్రతిదీ పరీక్షించడం, పరీక్షించిన దానిని తయారు చేయాలనుకోవడం దినచర్యగా మారింది. ఎప్పుడూ ఏదోక ప్రయోగం చేస్తుండేవాడు.
పదేళ్ళు వచ్చేసరికే పేదరికపు కష్టాలెక్కువైనాయి. డబ్బుల కోసం న్యూస్ పేపర్లు వేయడం మొదలు పెట్టాడు. స్వీట్స్ అమ్మసాగాడు. ఆ వచ్చిన డబ్బులతో ప్రయోగాలు చేయసాగాడు. తన 12 ఏళ్ళ వయస్సులో అనుకోకుండా ఒక స్టేషన్ మాష్టర్ కూతురును కాపాడడంతో రైల్వేలో చిన్నపని సంపాదించాడు. అక్కడే టెలిగ్రఫీ నేర్చుకొన్నాడు.1861లో అమెరికాలో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు తను కనిపెట్టిన ముద్రణా యంత్రంతో "గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్ "అనే చిన్నపాటి వార్తాపత్రికను నడిపాడు. రైల్వే బోగినే ప్రయోగశాలగా మార్చుకున్న ఆ పిల్లాడు అనుకోకుండా రైల్ లో అగ్ని ప్రమాదానికి కారకుడైనాడు..ఈ ప్రమాదంతో తన వినికిడి శక్తిని కోల్పోయాడు. రైల్వే అధికారులు అతనిని పని నుండీ తీసేసారు. ముద్రణా యంత్రాన్ని మండుతున్న మంటలలో వేయడంతో అదీ కాలిపోయింది.
అయినా పరిశోధనలు ఆపలేదు.1862లో తన 16 యేట టెలిగ్రాఫ్ కనుగొన్నాడు. 1868లో దానికి పేటెంట్ హక్కు పొందాడు. ఒక స్టాక్ ఎక్ఛేంజ్ లో పనికి కుదిరిన తరువాత తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్మకానికి పెట్టాడు. ఏదో చిన్నమొత్తం వస్తుందనుకున్న ఆ కుర్రాడికి ఏకంగా $40000 లభించింది. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ డబ్బుతో పరిశోధనలపై ధృష్టి పెట్టాడు..1871లో ఫోనోగ్రాఫ్ కనుగొన్నాడు. 1878లో అతను కనిపెట్టిన ఎలక్ట్రిక్ బల్బ్ తో ఆయన జీవితమే మారిపోయింది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి చేర్చింది.
1887-1889 మధ్యకాలంలో టైప్ రైటర్ ,ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమెరా కనుగొన్నాడు.1882లో అమెరికాలో మొదటి విద్యుత్ క్షేత్రం నెలకొల్పాడు. 1889 లో పారిస్ ఆవిష్కరణల ఎగ్జిబిషన్ కమ్ పేటెంట్ కార్యక్రమంలో 90% పరికరాలు ఈయన రూపొందించినవే.
ఇంతకీ ఇతనెవరనుకుంటున్నారా?? థామస్ అల్వా ఎడిసన్, ప్రపంచానికి వెలుగులు ఇచ్చిన మేధావి. మనం ఇప్పుడు ఉపయోగించే చాలా పరికరాలు ఆయన రూపొందించనవే. మైనింగ్, రబ్బరు, బ్యాటరీ, సిమెంట్ మొదలగు పరిశ్రమలలో ఆయన రూపొందించిన రక్షణ కవచాలే ఎక్కువ. 1847 ఫిబ్రవరి-11 న పుట్టిన థామస్ అల్వా ఎడిసన్ 1931లో చనిపోయే వరకు దాదాపు 1300 పేటెంట్స్ పొందాడు. 2500 కోట్ల ఆస్థిని కలిగివున్నారు.
మందబుద్ధి వాడు చదువుకు పనికిరాడని పాఠశాల తిరస్కరించినా, అమ్మ దగ్గర చదువుకొని, ఎటువంటి డిగ్రీ లేకుండా ఎన్నో ఉపయోగకరమైన ఆవిష్కరణలు చేసిన అతి సామాన్యుడు. ప్రపంచమంతా ఆయనకు రుణపడివుంది.
"ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చరిత్రను పిల్లలకు తెలియచేద్దాం."
(From Madhusudana Rao Mamidi wall)

No comments:

Post a Comment