Sunday, November 22, 2020

రైల్వే ప్రవేటీకరణ

 రైల్వే ప్రవేటీకరణను అపాలి . దేశాన్ని కాపాడాలి

నవంబర్ 26 దేశవ్యాపిత సమ్మెను విజయవంతం చేయండి.
NDA ప్రభుత్వము రైల్వే ప్రవేటీకరణకు ఒక పెద్ద కార్యక్రమానికి శ్వీకారం చుట్టింది.. 109 రూట్లలో 151 ప్రవేట్ ట్రైనులను నడపాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే పార్సెల్, రవాణా , ట్రాక్ నిర్మాణం నిర్వహన కోచ్ ఇంజన్ల నిర్వహణ , శుభ్రత రన్నింగ్ రూమ్ నిర్వహణ టికెట్లు అమ్మకం కేటరింగ్ పనులు వంటివి ప్రవేటీ వారికే అప్పగించబడిని.
ముందుగా వున్న VRR ను రద్దు చేసి IRCTC ని ఏర్పాటు చేసి మొత్తం క్యాటరింగ్ వ్యవస్థను ప్రవేట్ పరం చేసారు . కాంట్రాక్టు లకు ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా హెల్పేర్ కార్మికులు పని పోయి బాధలు పడుతున్నారు. కాంట్రాక్టర్ల ల వద్ద పని చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాంట్రాక్ట్ వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి వుంది. PF , WCA , కార్మిక చట్టాలు ఏమి అమలు కావు. చివరికి కాంట్రాక్ట్ చట్టం క్రింద రావలసిన వేతనాలు కూడా ఇవ్వరు. అందుకోసం కూడా పోరాటాలు చేయవలసి వస్తుంది. ప్రయాణికులు కూడా కాంట్రాకర్ నిర్ణయించిన రేట్లకు టిఫన్, భోజనం తీసుకోలేక ప్రయాణాలు చేస్తున్నారు.
ఇంకా 400 రైల్వేస్టేషన్లను ఆధునీకరన పేరుతో వందల కోట్లా రూపాయలను కేటాయిస్టున్నారు .ఈ ఆధునీకరణ చేపట్టేది ప్రవేట్ సంస్థలే . వివేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారుసులప్రకారం రైల్వే వివిధ భాగాలుగా విభజించి, ప్రవేటీకరించాలి. ఈ క్రమంలో కోచ్ నిర్మాణ ,నిర్వహణ ఫ్యాక్టరీలను, షెడ్లను, వర్కుషాపులను రైల్వేల నుండి . విడదీసి , అంతిమంగా ప్రవేట్ సంస్థలకు అప్ప జెప్పడమే తరువాయి.
ప్రవేట్ సంస్తలు లాభాలను ఆశించి మాత్రమే ప్రవేశిస్థాయి. . అదేపనిగా ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటిస్తోంది. . ప్రవేట్ ట్రైన్లను నడ్డుపుకోవడానికి ఇంజన్లు, కోచ్లు సిబ్బందిని ఎక్కడనుండి అయినా తెచ్చు కోవచ్చును. ఈ ట్రైన్లో టికెట్ ధరలను ప్రవేట్ సంస్థలే నిర్ణయిస్తాయి. మిగతా ట్రైన్ లన్నిటిని ప్రక్కకుబెట్టి ఆలస్యం కాకుండా ఈ ట్రైన్లకు ప్రాధాన్యత ను ఇస్తారు వీరికి ఇష్టమయిన రూట్లు అంటే మంచి లాభదాయకమయిన రూట్లను ఎంచుకోవచ్చను. రైల్వేలో ఇంజన్లు కోచ్ తయారి కయ్యె ఖర్చు మూడు అంత కన్నా ఎక్కువ రేట్లు ధరలతో కొనుగోలు చేయడానికి సిద్దపడి ఒప్పందాలు కూర్చుకుంటున్నారు వీటిలో ఎక్కువభాగం విదేశీ సంస్థలే
భారత రైల్వేలను నిర్మించుకోవడంలో అనేక మంది తమ భూములను శ్రమను, చెమటను, రక్తాలను ధారపోశారు . కొంతమంది చనిపోయారు .అనేకమంది గాయాల పాలయ్యారు ప్రభుత్వనిధులు ఎంతో వెచ్చించారు . ఇంత శ్రమకోర్చి నిర్మించుకున్న ప్రభుత్వ సంస్థలు ప్రవేటు వారికి అప్పచెప్పి మరల వారి దగ్గరే భిక్షాందేహి అనాల్సి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం?
ఈ నాడు 17.5 లక్షల ఉద్యోగులు 11 లక్షలమందికి కుదించ బడ్డారు . రిక్రూట్మెంట్ దాదాపు ఆగిపోయింది. లేదానామ మాత్రమే వి ఆర్ ఎస్ ను రుద్దుతూ 50 శాతము ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉన్నారు. ఎస్.సి. ఎస్.ట్టి. ఓ బి సి యువతకు, ఇంకా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు.
అనేక శ్రామిక ప్రజలకు చవకయినా రవాణా మార్గంగా ఉన్న రైల్వే ప్రియమవ్వబోతుంది. అనేక వర్గ పేద ప్రజలకు విద్యార్థులకు , ఎస్.సి.ఎస్.టి ఓబీసీ వర్గాలకు వృద్దులకు స్ట్రీలకు , స్వాతంత్ర సమరయోధులకు, అంగవైకల్యము కలవారికి ప్రయాణ చార్జీలతో కలిపిస్తోన్న రాయితీలను తొలగించే అవకాశం ఉంది. వెనకబడ్డ నష్టాలొచ్చే రూట్లను మూసివేసే అవకాశం ఉంది.
మిత్రులారా. రైల్వే ప్రవేటీకరన్ అపుటకు రైల్వే కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాల్సి వుంది. 1974 లో కార్మిక సంఘాలు ఐక్యంగా NCCRS ను ఏర్పాటు చేసుకొని ఆర్ధక డిమాండ్లకు పోరాటం చేసినట్లు రైల్వేను రక్షించుకోవడానికి , దేశాన్ని రక్షించుకోవడానికి చైతన్యువంతమయిన పోరాటం నిర్వహించాల్సివుంది. అందుకు నవంబర్ 26 న జరుగుతున్నా చారిత్రాత్మక సమ్మెలో పాల్గొని ప్రజలతో కల్సి రైల్వేను దేశాన్ని రక్షించుకోవడానికి నడుం బిగించాల్సివుంది.
కానీ రైల్వే కార్మిక సంఘాలు నవంబర్ 26న జరిగే దేశవ్యాపిత సమ్మెలో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నాయి. ఇది సరియైనది కాదు. NCCRS ఏర్పాటు చేసుకొని దేశవ్యాపిత సమ్మెకు దూరంగా ఉండటం అసలు సరియైనది కాదు. రైల్వేను రక్షించుకోవడానికి , దేశాన్ని రక్షించుకోవడానికి రైల్వే కార్మిక వర్గం నడుం బిగించాలి. కార్మిక సంఘాలను కూడ ప్రశ్నించాలి.
ఇంకా ముఖ్యమయిన విషయం ప్రవేటీకరణ వ్యతిరేకించే పార్టీలు, శక్తులు పరిపాలనలోకి రాకపోతే ప్రభుత్వసంస్థలు ఉండవు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. రైల్వే కార్మిక వర్గం, దేశంలోని కార్మిక రంగం ప్రవేటీకరణ ను వ్యతిరేకించే పార్టీలను అధికారంలోకి తేవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రవేటీకరణను వ్యతిరేకించే పార్టీలు తము అధికారం లోకి రావడానికి కృషి చేయాలి .
కార్మిక, ప్రజా , వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి.
రైల్వేను , ప్రవేట్ ప్రభుత్వ సంస్థలను ప్రవేటీకరణ ను వ్యతిరేకించండి.
కార్మిక ప్రజల ఐక్యత వర్ధిల్లాలి
రైల్వే ప్రవేటీకరణ వ్యతిరేక వేదిక